TyDiQA1.0

The Typologically Different Question Answering Dataset

Predictions

Scores

స్టీఫెన్ హాకింగ్

The Typologically Different Question Answering Dataset

అప్పటికి ప్రఖ్యాత ఖగోళ శాస్త్రవేత్త గెలిలియో మరణించి దాదాపు 300 సంవత్సరాలు అవుతోంది. అప్పుడే అంటే 1942 జనవరి 8వ తేదీన ఇంగ్లాండులోని ఆక్స్ ఫర్డ్ లో స్టీఫెన్ హాకింగ్ జన్మించాడు. ఆయన తండ్రి వృత్తి రీత్యా లండన్ లో వైద్య శాస్త్ర పరిశోధకుడు. రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో లండన్ లో నెలకొన్న ప్రమాదకర పరిస్థితుల వల్ల స్టీఫెన్ తల్లిని ఆక్స్ ఫర్డ్ లోని సురక్షిత ప్రాంతానికి పంపించారు. కొంత కాలానికి ఆయన కుటుంబం లండన్ లోని హైగేట్స్ ప్రాంతానికి తరలివచ్చింది. స్టీఫెన్ తన విద్యార్థి జీవితాన్ని అక్కడే ప్రారంభించాడు. తర్వాత అంటే 1950లో ఆయన తండ్రి కుటుంబాన్ని మిల్ హిల్ ప్రాంతానికి మార్చాడు. తండ్రి స్టీఫెన్ ని అక్కడి సెయింట్ ఆల్బన్స్ పాఠశాలలో చేర్చాడు. తన గణిత ఉపాధ్యాయుని ప్రేరణతో గణితశాస్త్రంలో స్పెషలైజేషన్ చేద్దామనుకున్నాడు స్టీఫెన్. కాని దానికి వ్యతిరేకంగా తండ్రి రసాయనశాస్త్రంలో చేర్పించాడు. తరువాత 1959లో నేచురల్ సైన్స్ విద్య కోసం స్కాలర్ షిప్ పరీక్ష రాశాడు. అందులో సఫలీకృతుడు కాగలిగినా... భౌతిక శాస్త్రంలో స్పెషలైజేషన్ చేశాడు స్టీఫెన్. 1962లో కేవలం ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణుడు కాగలిగాడు. కాస్మాలజి, జనరల్ రిలెటివిటీ పరిశోధనల కోసం ఆక్స్‌ఫర్డ్ కి వెళ్ళాడు. అప్పటి నుంచి స్టీఫెన్ పరిస్థితి పూర్తిగా మారింది. అన్నం తినాలన్నా... కనీసం బూట్ల లేసు కట్టుకుందామన్నా... స్టీఫెన్ శరీరం సహకరించేది కాదు. క్రిస్‌మస్ సెలవులకు ఇంటికి వెళ్ళిన స్టీఫెన్ పరిస్థితి ఆయన తల్లిదండ్రులను కలవర పెట్టింది. భోజనం చేయడానికి ఆయన పడుతున్న ఇబ్బంది... తల్లిని మధనపెట్టింది. ఆ సమయంలోనే ఆసుపత్రిలో చేసిన పరీక్షల్లో ఆయనకు మోటార్ న్యూరాన్ వ్యాధి (Motor Neuron Disease) అనే భయంకర వ్యాధి ఉన్నట్టు తెలిసింది. దీనినే Amyotrophic Lateral Sclerosis (ALS) వ్యాధి అని కూడా అంటారు. నాడీ మండలం పై అంటే నరాలు, వెన్నుపూస పై ఇది ప్రభావం చూపుతుంది. భౌతిక శాస్త్రవేత్త వెర్నర్‌ ఇస్రయిల్‌ ‘మోజట్‌ కంపోజింగ్‌ సింఫనీ’ తెచ్చి స్టీఫెన్‌ తలకు అమర్చాడు. దాని వల్ల ఆయనకు తనను తాను వ్యక్తీకరించుకునే అవకాశం కలిగింది. దాన్ని అభ్యసించడానికి ఆయనకు కొంత సమయం పట్టినా, తర్వాత కాలంలో అది ఎంతో ఉపయోగపడుతూ వచ్చింది. 1970 నాటికి మాట పూర్తిగా పడిపోయింది. అతని హావభావాలు కుటుంబ సభ్యులకు, అతి సన్నిహితులకు మాత్రమే అర్థమయ్యేవి. 1985లో ఆయనకు నిమోనియా వచ్చింది , అప్పటి నుంచీ ఒక చక్రాల కుర్చీకి పరిమితమై తన చేతి చిటికెన వేలి కదలికల సాయంతో మాత్రమే దానికి అనుసంధానించి, రూపొందించిన ‘వాయిస్‌ సింథసైజర్‌’తో తన ఆలోచనలను శాస్త్ర లోకానికి అందిస్తున్నారు. హాకింగ్‌ చిటికెన వేలు కదలికల్ని ఒక హ్యాండ్‌ కంట్రోలర్‌ యంత్రానికి అమర్చిన తెరపై అక్షరాలను స్కాన్‌ చేసే కర్సర్‌ నియంత్రిస్తుంది. ఆయన ఎంచుకున్న అక్షరాల్ని, యంత్రంలోని వ్యవస్థ తనంతట తానే పని చేసే ‘అల్గారిదమ్‌’ సాయంతో మాటలు వాక్యాల రూపంలో రూపొందించి తెరపై ప్రకటిస్తుంది.కంప్యూటర్‌ ఇంజనీర్‌ డేవిడ్‌, ఒక చిన్న కంప్యూటర్‌ని స్టీఫెన్‌ హాకింగ్‌ వీల్‌ఛైర్‌కు అమర్చాడు. అందులోని సింథసైజర్‌ విషయాన్ని మాటగా మార్చి ఎదుటి వారికి వినిపిస్తుంది. అందుకోసం తన గొంతునే వాడమన్నాడు స్టీఫెన్‌. మాట పడిపోక ముందున్న తన గొంతు ధ్వనిని అందులో ఉపయోగించమన్నాడు. దాని వల్ల స్టీఫెన్‌ హాకింగ్‌ సాంకేతిక సంభాషణ సహజ సంభాషణలా మారిపోయేది.   డాక్టరేట్ సంపాదించేలోపే స్టీఫెన్ మరణిస్తాడని అనుకున్నారంతా... కానీ ఆయన పట్టుదల, ఆత్మస్థైర్యం ముందు మృత్యువు ఓడిపోయింది. మళ్లీ విశ్వవిద్యాలయానికి తిరిగివచ్చిన హాకింగ్ తన పరిశోధనల్లో నిమగ్నమయ్యాడు. ఆయన ఆరోగ్య పరిస్థితి తెలిసి మిత్రులు సహకరించాలని చూసినా స్టీఫెన్ సున్నితంగా తిరస్కరించే వాడు. 2018 మార్చ్ 14 న బుధవారం ఉదయం ఆయన కేంబ్రిడ్జ్‌లోని తన నివాసంలో మరణించారు[1].

స్టీఫెన్ విలియం హాకింగ్ ఎప్పుడు జన్మించాడు?

  • Ground Truth Answers: 1942 జనవరి 81942 జనవరి 81942 జనవరి 8

  • Prediction: